: క‌ర‌ణ్‌జొహార్ ‘ఏ దిల్‌హై ముష్కిల్’ సినిమా విడుదలకు ‘పాక్ నటుల’ క‌ష్టాలు!


బాలీవుడ్ నటులు రణ్‌బీర్‌ కపూర్‌, ఐశ్వర్యరాయ్‌, అనుష్క శర్మలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఏ దిల్‌ హై ముష్కిల్ మూవీ విడుద‌ల‌ను క‌ష్టాలు చుట్టుముట్టాయి. బాలీవుడ్ ద‌ర్శ‌క‌-నిర్మాత‌ క‌ర‌ణ్‌జొహార్ ఈ సినిమాను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ సినిమాలో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ కూడా న‌టించాడు. భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య త‌లెత్తిన ఉద్రిక్త‌త‌లతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన పాక్‌ న‌టుల‌ను దేశం విడిచి వెళ్ల‌మ‌న‌డం, ఆ త‌రువాత ప‌లు సినీ సంస్థ‌లు అందుకు మ‌ద్ద‌తు తెల‌ప‌డం తెలిసిందే. తాజాగా విడుద‌ల‌కు సిద్ధ‌మైన క‌ర‌ణ‌జొహార్ ‘ ఏ దిల్‌ హై ముష్కిల్’ మూవీని సినీ థియేటర్స్ ఓన‌ర్స్ అసోసియేష‌న్ విడుద‌ల చేయ‌బోమ‌ని తేల్చి చెప్పింది. పాక్ నటులు నటించిన ఏ సినిమాలను కూడా విడుదల చేయబోమని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News