: 'శత'క్కొట్టిన యువరాజ్... సెలక్టర్లకు సవాల్!


తిరిగి భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్న డ్యాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్, పంజాబ్ తరఫున రంజీ మ్యాచ్ లో బరిలోకి దిగి మధ్యప్రదేశ్ పై అద్భుత సెంచరీని సాధించి సెలక్టర్లకు తనదైన రీతిలో సవాల్ విసిరాడు. 241 బంతుల్లో 24 ఫోర్ల సాయంతో 164 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరుకు చేరి పటిష్టస్థితిలో నిలిచింది. మరోవైపు యువరాజ్ తో పాటు గురుకీరత్ సైతం సెంచరీ సాధించాడు. సాధ్యమైనంత త్వరలో తిరిగి భారత జట్టుకు ఎంపిక కావాలన్నదే తన అభిమతమని మ్యాచ్ అనంతరం యువరాజ్ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News