: వన్డే ర్యాంకుల్లో కివీస్ స్థానాన్ని సొంతం చేసుకోవాలంటే ఇండియా నాలుగు గెలవాల్సిందే!


న్యూజిలాండ్ తో టీమిండియా వన్డే సిరీస్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆటగాళ్లంతా ధర్మశాలకు చేరుకున్నారు. టెస్టుల్లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్న టీమిండియా, వన్డేల్లో నాలుగో ర్యాంకులో ఉంది. కివీస్ తో జరిగే సిరీస్ ను గెలిచి ర్యాంకు మెరుగుపరుచుకోవాలని భారత జట్టు భావిస్తోంది. వన్డే సిరీస్ ను నెగ్గి తమ మూడోర్యాంకు స్థిరపరుచుకోవాలని కివీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఐదు వన్డేల సిరీస్ ను 4-1తో నెగ్గితేనే వన్డేల్లో నాలుగో ర్యాంకులో నుంచి మూడో ర్యాంకుకు ధోనీ సేన చేరుకోనుంది. భారత్ మూడో ర్యాంకు చేరుకోవాలంటే కచ్చితంగా ఈ సిరీస్ లో నాలుగు వన్డేల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. మూడో ర్యాంకులో ఉన్న కివీస్ ఖాతాలో 113 పాయింట్లుండగా, భారత్ ఖాతాలో 110 పాయింట్లు ఉన్నాయి. మూడు పాయింట్లు అధికంగా ఉన్న కివీస్ పై సిరీస్ ను 4-1తో నెగ్గితే టీమిండియా మూడో ర్యాంకుకు చేరుకుని, ఆ జట్టును నాలుగో ర్యాంకుకు పరిమితం చేస్తుంది. లేని పక్షంలో కివీస్ స్థానం పదిలమవుతుంది.

  • Loading...

More Telugu News