: 50 ఏళ్ల వయసులో గర్భం ధరించిన పాప్ స్టార్... బిడ్డపేరు మైఖేల్ జాక్సన్!


పాప్ స్టార్ జానెట్ జాక్సన్ (మైఖేల్ జాక్సన్ సోదరి) 50 ఏళ్ల వయసులో గర్భం ధరించడంతో సంతోషం పట్టలేకపోతోంది. లేటు వయసులో మహిళలు గర్భం ధరించడం అరుదుగా జరుగుతుంది. జానెట్ విషయంలోనూ అదే జరిగింది. దీంతో ఆమె సంతోషంలో మునిగిపోయింది. జేమ్స్ డీ బార్జే ను 1984 లో తొలిసారి వివాహం చేసుకొన్న జానెట్ ఏడాదిపాటు అతనితో కాపురం చేసి, తర్వాత డైవోర్స్ తీసుకుంది. ఆ తరువాత రెనె ఎలిజోండో జూనియర్ ను 1991 లో వివాహమాడి సుమారు 9 ఏళ్లు సజావుగా కాపురం చేసి, 2000వ సంవత్సరంలో అతనికి విడాకులిచ్చింది. సుదీర్ఘ కాలం ఒంటరిగా ఉన్న జానెట్ జాక్సన్ ఎట్టకేలకు 2010 లో విస్సామ్ అయ్ మానాను వివాహమాడింది. తామిద్దరికి బిడ్డ పుట్టబోతున్నట్టు ఇప్పుడు ప్రకటించింది. పుట్టబోయే బిడ్డకు తన సోదరుడు, పాప్ రారాజు దివంగత మైఖేల్ జాక్సన్ పేరు పెట్టుకుంటానని చెబుతోంది.

  • Loading...

More Telugu News