: కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ లపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న


విజయవాడలో నైట్ కల్చర్ ను పెంపొందించడం, ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం స్వయంగా ప్రారంభించిన ఫుడ్ పార్క్ ను ఏకపక్షంగా తొలగించే యత్నం చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.బాబు, విజయవాడ మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ లపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం నెల్లూరు రొట్టెల పండగలో పాల్గొనేందుకు బయలుదేరే ముందు చంద్రబాబును కలిసిన నేతలు, ఫుడ్ కోర్టు వివాదాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులను వీరు చేస్తున్నారని, ప్రశ్నించిన తమను కూడా లక్ష్యపెట్టలేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News