: క్రికెటర్ బ్రావోతో డేటింగ్ చేస్తున్న హీరోయిన్ శ్రియ!


దాదాపు పదేళ్లకు పైగా కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు లోగిళ్లకు సుపరిచితమైన హీరోయిన్ శ్రియా శరణ్, వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న వీరి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్యా ఏం జరుగుతోందన్న విషయంలో అటు బ్రావో, ఇటు శ్రియ నోరు మెదపనప్పటికీ, ఏ స్థాయికి వీరి పరిచయం చేరుకుందోనని పరిశ్రమ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఓ వైపు సినిమాలు తగ్గి ర్యాంప్ షోలు, ఓపెనింగ్ ఈవెంట్ లలో నృత్యాలు చేస్తూ కాలం గడుపుతున్న శ్రియ, తాజాగా బ్రావోతో సంబంధంపై ఏం చెబుతుందో? వీరిద్దరూ కలసి వస్తున్న చిత్రాన్ని ఇక్కడ మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News