: గెలాక్సీ నోట్ 7ల కోసం ఫైర్ ప్రూఫ్ బాక్సులు పంపుతున్న శాంసంగ్... ఎద్దేవా చేస్తున్న నెటిజన్లు!
శాంసంగ్ కంపెనీ పరువు తీసిన గెలాక్సీ నోట్ 7 ఫోన్ల తయారీని ఇప్పటికే ఆపివేసిన సంస్థ, మార్కెట్లోని అన్ని ఫోన్లనూ వెనక్కు తీసుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో, తిరుగు ప్రయాణంలో అవి ప్రమాదానికి గురి కాకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఫైర్ ప్రూఫ్ బాక్సులను, గ్లౌజులను కొనుగోలుదారులకు పంపుతోంది. రెండు నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్లు పేలుతుండటంతో వాటిని రీప్లేస్ మెంట్ చేసినప్పటికీ, అవి కూడా ప్రమాదకరమని తేలిన సంగతి తెలిసిందే. వీటిని వెనక్కు తీసుకునేందుకు నాలుగంచెల భద్రత ఉండేలా నాలుగు కార్టన్ లు, అగ్నికి ఆహుతికాని విధంగా తయారు చేసిన పౌచ్ లను పంపుతోంది. ఇక సంస్థ ఫైర్ ప్రూఫ్ బాక్సుల విషయంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ బాక్సులైనా సరిగ్గా పనిచేస్తాయా? వాటిని టెస్ట్ చేశారా? అంటే శాంసంగ్ ను గేలి చేస్తూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.