: 'ఎంఎస్ ధోనీ' సినిమా వసూళ్లు 117 కోట్లు


టీమిండియా లిమిటెడ్ ఓవర్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్రతో తెరకెక్కిన సినిమా 'ఎంఎస్ ధోనీ - ది అన్ టోల్డ్ స్టోరీ' వసూళ్లలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు రూ. 116.91 కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది. ఈ కలెక్షన్లు కూడా కేవలం భారత మార్కెట్ నుంచి వచ్చినవే. ఈ వివరాలను ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. జీవిత చరిత్రల ఆధారంగా తీసిన సినిమాల్లో ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ లో కలెక్షన్లు రాకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాతలు మాట్లాడుతూ, ధోనీపై భారతీయులకు ఏ స్థాయిలో అభిమానం ఉందో ఈ కలెక్షన్లు తెలియజేస్తున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News