: నా కుమార్తెను హత్య చేసిన కుమారుడిని క్షమించలేం... మీరూ క్షమించవద్దు: ఖండీల్ బలోచ్ తండ్రి


తన కుమార్తె ఖండీల్ బలోచ్ ను హత్య చేసిన కుమారుడి (మొహ్మద్ వాసిం)కి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం లేదని పాక్ సోషల్ మీడియా స్టార్ ఖండీల్ బలోచ్‌ తండ్రి మొహ్మద్ అజీం తెలిపారు. ఇస్లామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తమ వైపు నుంచి వాసింకు క్షమాభిక్ష లేదని, వీలైనంత త్వరగా అతనిని శిక్షించాలని డిమాండ్ చేశారు. అతనికి మరణశిక్ష పడితేనే తాము ఆనందిస్తామని ప్రకటించారు. కాగా, సోషల్ మీడియాలో అసభ్య ఫోటోలు పెట్టి, కుటుంబం పరువు తీస్తోందని ఆరోపిస్తూ ఆమె సోదరుడు వాసిం ఆమెను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆయన అలా హత్య చేయడం వెనుక మతగురువు ప్రోత్సాహం ఉందంటూ వార్తలు వెలువడ్డాయి. పాక్ లో ఒక కుటుంబంలోని ఎవరినైనా అదే కుటుంబంలోని సభ్యుడు పరువు హత్య చేస్తే, హతుడి కుటుంబ సభ్యులు నిందితుడ్ని క్షమిస్తే అతనిపై ఎలాంటి కేసులు ఉండవు. దీంతో పాకిస్థాన్ లో పరువు హత్యలు చేస్తున్నవారు చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని బయటపడుతున్నారు. ఇలాగే బయటపడొచ్చిన భావించిన ఖండీల్ బలోచ్‌ సోదరుడు కుటుంబ సభ్యుల చొరవతో శిక్షించబడనున్నాడు.

  • Loading...

More Telugu News