: బ్లాక్ టికెట్లు అమ్ముతూ పట్టుబడ్డ పోలీసులు!


కేరళలోని సోషల్ మీడియాలో కొత్త విధుల్లో నిమగ్నమైన పోలీసుల వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. గత వారం 'పులి మురుగన్' అనే మలయాళ సినిమా రిలీజవడంతో, కేరళలోని థియేటర్లు ప్రేక్షకులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో థియేటర్ల వద్ద రద్దీని నియంత్రించేందుకు పోలీసులను నియమించారు. అయితే థియేటర్లలోని రద్దీని నియంత్రించాల్సిన పోలీసులు, అసలు విధులను వదిలేసి కొత్త విధులను చేపట్టడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొట్టాయంలో అభిలాష్ థియేటర్‌ ప్రేక్షకులతో కిటకిటలాడడంతో, బ్లాక్ టికెట్లు అమ్మేవారు రంగప్రవేశం చేశారు. దీంతో పోలీసులు వారి నుంచి టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంతలో థియేటర్ ముందు హౌస్ ఫుల్ బోర్డు పెట్టారు. దీంతో పోలీసులు బ్లాక్ టికెట్లు అమ్మేవారి విధుల్లోకి మారిపోయారు. బ్లాక్ టికెట్లు అమ్ముకున్నారు. ఈ తతంగాన్ని పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో అక్కడ పోలీసుశాఖలో కలకలం రేగింది. సదరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని పోలీసు బాసులు తెలిపారు.

  • Loading...

More Telugu News