: కేజ్రీవాల్ ను విమర్శిస్తూ బీజేపీ కార్యాలయంలో వెలిసిన పోస్టర్లు
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నారు. ఇటీవల కేజ్రీవాల్ సర్జికల్ దాడులపై ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందు కేజ్రీవాల్ ఒక దోమని చంపి చూపాలని పోస్టర్లో పేర్కొన్నారు. ఆ తరువాత భారత సైన్యం పీవోకేలో చేసిన సర్జికల్ దాడులపై రుజువులు అడగాలని సూచించారు. ఢిల్లీలో చికున్ గున్యా వ్యాధితో ప్రజలు అల్లాడిపోతున్నారని అందులో పేర్కొన్నారు. బీజేపీ యూత్ వింగ్ కార్యకర్తలు ఈ పోస్టర్లను అక్కడ అంటించారు.