: రాకెట్ లాంచర్ల దాడిని సైతం తట్టుకునేలా సీఎం ఆఫీస్.. ప్రత్యేకతలు బోలెడు.. నేడు ప్రారంభించనున్న చంద్రబాబు


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచే పాలన సాగించాలని గట్టి పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. ఈ ఉదయం 8.09 గంటలకు ముఖ్యమంత్రి తన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేటి నుంచి అమరావతి కేంద్రంగానే పాలన సాగించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించారు. ఆ భవనం ఎలా ఉందంటే.. అమరావతిలో మొత్తం ఆరు భవనాలుగా నిర్మిస్తున్న సచివాలయంలో ఇప్పటికే నాలుగు భవనాలు సిద్ధమయ్యాయి. 2,3,4,5 భవనాల్లో ఇప్పటికే మంత్రులు తమ శాఖలను ప్రారంభించేశారు. లాంఛనంగా ప్రారంభం కావాల్సిన రెండు భవనాల్లో ఒకటి ముఖ్యమంత్రి కార్యాలయ భవనం, రెండోది అసెంబ్లీ, మండలి సమావేశాల భవనం. ముఖ్యమంత్రి సహా ఆయన కార్యాలయ సిబ్బంది, సీఎస్, సీఎం కార్యదర్శులు, మంత్రివర్గ సమావేశ భవనం, వీడియో కాన్ఫరెన్స్, ఇతర సమావేశ మందిరాలు ఈ భవనంలోనే ఉన్నాయి. ఈ భవనం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రాకెట్ లాంచర్లతో దాడిచేసినా.. సీఎం కార్యాలయ భవనాన్ని అత్యంత పటిష్టంగా, రక్షణాత్మకంగా నిర్మిస్తున్నారు. రాకెట్ లాంచర్లతో దాడిచేసినప్పటికీ భవనానికి ఎటువంటి ముప్పు ఉండని రీతిలో నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత దృష్ట్యా పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో నిర్మిస్తున్నారు. బాబు సూచనల మేరకు కార్యాలయంలో చిన్నచిన్న మార్పులు చేస్తున్నారు. మొత్తం భవనాన్ని 72/70 మీటర్ల నిష్పత్తిలో 50 వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఒక్కో భవనంలో రెండు అంతస్తులున్నాయి. మొత్తంగా లక్ష చదరపు అడుగుల మేర నిర్మాణం చేపట్టారు. 11 మీటర్లతో 36 గదులు నిర్మించనున్నారు. ఈ భవనంలో ఏడు లిఫ్ట్‌లున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా ఓ లిఫ్ట్ కేటాయించారు.

  • Loading...

More Telugu News