: రాహుల్ ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ సోనియాకు వీడియో సందేశం పంపిన కాంగ్రెస్ నేత!


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్ కు చెందిన నేత ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీకి పంపిన వీడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంపీలోని బర్వానీ జిల్లా కాంగ్రెస్ సంస్థాగత కార్యదర్శి శైలేష్ చౌబే నిమిషంన్నర నిడివి గల వీడియోలో జవాన్ల రక్తంతో రాజకీయం చేసే రాహుల్ గాంధీని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయన వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని, ఆయనకు ఏదైనా వ్యాపారం అప్పగించాలని ఆయన సూచించారు. బీజేపీపై పోరాడే తమలాంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేసే నేత కింద పనిచేయలేరని ఆయన పేర్కొన్నారు. నాయకత్వ లక్షణాలు లేని రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీకి సేవలందించలేమని ఆయన తెలిపారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, రైతు యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, సర్జికల్ స్ట్రైక్స్ చేసి వీర జవాన్లు దేశాన్ని రక్షిస్తుంటే... అధికారంలో కూర్చున్న ప్రధాని మోదీ వాటిపై పబ్లిసిటీ చేసుకుని, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. అమర జవాన్ల రక్తంతో రాజకీయ లబ్ధి పొందాలని చూడడం శోచనీయమని ఆయన మండిపడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News