: జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు

అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఆమెకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు లభించాలని కోరారు. తిరుమల ప్రసాదం, వస్త్రాలను ఓ ప్రత్యేక అధికారి ద్వారా చెన్నై పంపిస్తామని చెప్పారు. విజయవాడలో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వివరాలను వెల్లడించారు.

More Telugu News