: న్యాయమూర్తిగా ఎస్సై కుమార్తె.. అభినందించిన సీపీ మహేందర్‌రెడ్డి


ఎస్సై కుమార్తె మేజిస్ట్రేట్‌గా ఎంపికయ్యారు. దీంతో ఎస్సై కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న స్పెషల్ బ్రాంచ్ ఎస్సై హసన్ షరీఫ్ కుమార్తె రుబీనా ఫాతిమా ఇటీవల నిర్వహించిన జడ్జి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. దీంతో ప్రభుత్వం ఆమెను ఖమ్మం ఎక్సైజ్ కోర్టు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సోమవారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేందర్‌రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. రుబీనాను సీపీ అభినందించారు. కుమార్తె ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని చదివించిన ఎస్సై హసన్ షరీఫ్‌ ఎందరికో స్ఫూర్తినిచ్చారని సీపీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News