: డాన్ పత్రికపై చర్యలు...నవాజ్ షరీఫ్ ఆదేశాలు

పాకిస్థాన్ ప్రముఖ పత్రిక 'డాన్'పై చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ అధికారులను ఆదేశించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే... ప్రధాని నవాజ్ షరీఫ్ ను తాజాగా ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ కలిశారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి ఇషాక్ దార్, అంతర్గత వ్యవహారాల మంత్రి నిసార్ అలీఖాన్, పంజాబ్ సీఎం షాబాజ్ షరీఫ్‌, ఐఎస్ఐ డీజీ లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అక్తర్‌ తో ప్రధాని సమావేశమయ్యారు. ఆర్మీ చీఫ్ తో ప్రధానికి సత్సంబంధాలు లేవని ఈ నెల 6న డాన్ పత్రిక ప్రచురించిన కథనంపై ఈ మీటింగులో చర్చకు వచ్చింది. అది వండి వార్చిన కథనమని వారు అభిప్రాయానికి వచ్చి, దానిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో నిబంధనలకు వ్యతిరేకంగా, వాస్తవాలకు విరుద్ధంగా వార్తలు రాయడాన్ని ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా తీవ్రంగా పరిగణించారు. దీంతో డాన్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. డాన్ కథనంలో యూరీ దాడుల అనంతరం పాక్ అంతర్జాతీయంగా ఏకాకి అయిందని, ఇదే సమయంలో సర్జికల్ స్ట్రైక్స్ తో ఒత్తిడి పెరిగిందని, దీనికి తోడు నవాజ్ షరీఫ్ కు ఆర్మీ చీఫ్ తో పడడం లేదంటూ పేర్కొంది.

More Telugu News