: మీడియాలో వ్యాఖ్యలు చేసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి.. అమరావతి నిర్మాణంపై స్టే లేదు: ఎన్‌జీటీ
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణంపై స్టే ఉందన్న వార్తలను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఖండించింది. మీడియా ముందు మాట్లాడేటప్పుడు నాయకులు బాధ్యతాయుతంగా వ్యాఖ్యలు చేయాలని సూచించింది. నూతన రాజధాని నిర్మాణం కొనసాగింపు తుది నిర్ణయానికి లోబడే ముందుకువెళుతుందని తెలిపింది. ఎన్‌జీటీ ఇచ్చిన ఆదేశాలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది ఆ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఎన్‌జీటీ ఈ విధంగా స్పందించింది.