: సెంచరీ మార్క్ దాటిన ఎంఎస్ ధోని సినిమా


సిల్వర్ స్క్రీన్ పై కూడా టీమిండియా కెప్టెన్ ధోనీ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. తన జీవితకథ ఆధారంగా రూపొందిన 'ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. వసూళ్లలో వంద కోట్ల మార్కును దాటింది. సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదలైంది. ఇప్పటి వరకు ఇండియా మార్కెట్లో రూ. 103.4 కోట్లు వసూలు చేసిందని సినిమా నిర్మాతలు వెల్లడించారు. ధోనీకి సొంత దేశంలో లభిస్తున్న ప్రేమే ఈ సినిమా విజయానికి కారణమని... సినిమాకు లభిస్తున్న ప్రేక్షకాదరణ ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సీఈఓ విజయ్ సింగ్ తెలిపారు. ఈ సినిమాలో ధోనీ పాత్రను సుషాంత్ సింగ్ రాజ్ పుత్ పోషించాడు. దేశ వ్యాప్తంగా 4500 స్క్రీన్లపై ఈ సినిమా విడుదలైంది.

  • Loading...

More Telugu News