: 'ఆమె'కు ఇద్దరు భార్యలు... పైగా లైంగిక వేధింపులు.. 10 ఏళ్ల జైలు శిక్ష... సింగపూర్ చరిత్రలో అత్యంత అరుదైన తీర్పు!


సింగపూర్ దేశ చరిత్రలో ఇది ఓ అత్యంత అరుదైన కేసు కాగా, సంఘంలో మగాడిగా చెలామణి అవుతున్న ఓ మహిళకు లైంగిక వేధింపుల కేసులో 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం విధించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే... సింగపూర్ లో నివసిస్తున్న జునికా (40) పుట్టుకతో మహిళ. కానీ మగవాడిగా చెలామణి అవుతూ, తాను పురుషుడినేనని అందరినీ నమ్మించింది. ఏకంగా ఇద్దరు యువతులను పెళ్లాడి, వారిపై వికృత లైంగిక చేష్టలు చేసేది. సెక్స్ డాల్స్ ఉపయోగించేది. ఇది చాలదన్నట్టు పక్కనే ఉన్న ఫ్లాట్ లోని 13 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి వశపరచుకుని లైంగిక దాడులకు పాల్పడింది. ఆరు నెలల పాటు ఈ వ్యవహారం కొనసాగగా, చివరికి పక్కింటి వాళ్లతో జునికాకు గొడవలు వచ్చిన వేళ, ఆ బాలిక విషయాన్ని చెప్పింది. అప్పటికీ జునికాను పురుషుడేనని భావించిన వాళ్లు, పోలీసు కేసు పెట్టారు. సింగపూర్ చట్టాల ప్రకారం, లైంగిక దాడులు చేస్తే, 20 సంవత్సరాల వరకూ శిక్ష పడుతుంది. దీంతో భయపడిన జునికా, తానసలు పురుషుడిని కాదంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది. కేసు విచారణ నాలుగేళ్ల పాటు కొనసాగగా, మగాడు కాదు కాబట్టి ప్రధానమైన అత్యాచార ఆరోపణలను కొట్టేసిన కోర్టు, బాలిక పట్ల ఆమె ప్రవర్తన లైంగిక దాడితో సమానమేనని, ఇందుకు పదేళ్ల శిక్షను విధిస్తున్నామని తీర్పిచ్చింది.

  • Loading...

More Telugu News