: రేపే కొత్త జిల్లాల ప్రారంభం... ఏ జిల్లాను ఎవరు ప్రారంభిస్తారు?... వివరాలు ఇవిగో!
పవిత్రమైన విజయదశమి రోజున తెలంగాణలో 21 కొత్త జిల్లాలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో, కర్కాటక లగ్నంలో కొత్త జిల్లాల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. రేపు ఉదయం 11.13 గంటలకు ధనుర్ లగ్నంలో కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు ప్రారంభిస్తారు. ఎవరెవరు ఏయే జిల్లాలను ప్రారంభించనున్నారో ఓ సారి చూద్దాం.
సిద్ధిపేట - కేసీఆర్ (ఆయన వెంట హరీష్ రావు ఉంటారు)
మెదక్ - డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి
మంచిర్యాల - పద్మారావు
వికారాబాద్ - మహేందర్ రెడ్డి
సూర్యాపేట - జగదీష్ రెడ్డి
కొత్తగూడెం - తుమ్మల నాగేశ్వరరావు
నిర్మల్ - ఇంద్రకరణ్ రెడ్డి
సిరిసిల్ల (రాజన్న) - కేటీఆర్
ఆసిఫాబాద్ - జోగు రామన్న
జనగామ - మండలి ఛైర్మన్ స్వామిగౌడ్
వరంగల్ (రూరల్)- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
యాదాద్రి - నాయిని నర్సింహారెడ్డి
పెద్దపల్లి - ఈటల రాజేందర్
కామారెడ్డి - పోచారం శ్రీనివాస్ రెడ్డి
జోగులాంబ - లక్ష్మారెడ్డి
మేడ్చల్ (మల్కాజిగిరి) - తలసాని శ్రీనివాస్ యాదవ్
జయశంకర్ - స్పీకర్ మధుసూదనాచారి
జగిత్యాల - డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ
వనపర్తి - ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
నాగర్ కర్నూలు - జూపల్లి కృష్ణారావు
మహబూబాబాద్ - చందూలాల్