: నాసిక్ లో చిన్నారిపై అత్యాచారయత్నం.. మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత!
నాసిక్ లో ఐదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం సంఘటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. త్రయంబకేశ్వర్ లోని తాలేగావ్ లో ఈ సంఘటన ఇటీవల జరిగింది. దీంతో, పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవడంతో పాటు హింసాత్మక సంఘటనలూ చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వదంతులు వ్యాపించకుండా ఉండడానికి నాసిక్ లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కాగా, నాసిక్ ఐజీ కారుతో పాటు పోలీస్ వాహనాలను మూడింటిని ఆందోళనకారులు నిన్న తగులబెట్టారు. వారిని అదుపు చేసే నిమిత్తం పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.