: ఇంద్రకీలాద్రిలో భక్తులపై ప్రైవేట్‌ సెక్యూరిటీ అత్యుత్సాహం.. మండిపడ్డ భక్తులు


శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ ఆలయానికి ఈరోజు భక్తుల తాకిడి అధికంగా ఉంది. భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. దీంతో వారిని అదుపు చేసేందుకు దేవస్థానం నియ‌మించిన‌ ప్రైవేట్‌ సెక్యూరిటీ భద్రత కట్టుదిట్టంగా పనిచేస్తోంది. అయితే, సిబ్బంది ఈరోజు భక్తులపై ఓవరాక్ష‌న్ చేశారు. అమ్మవారి గర్భగుడిలో ఉన్న‌ భక్తులను అక‌స్మాత్తుగా బయటకు తోసివేశారు. భ‌ద్ర‌తా సిబ్బంది ప్ర‌వ‌ర్త‌న‌పై భ‌క్తులు మండిప‌డ్డారు. ద‌ర్శ‌నం చేసుకుంటున్న తమని తోసేయ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News