: చంద్రబాబు ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారు: భూమన


ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 100 కోట్లు ఖర్చు పెట్టారని... ఇది జరిగి ఏడాదవుతున్నా రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుకను కూడా పేర్చలేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. శంకుస్థాపన సమయంలో వేసిన శిలాఫలకాలు ఇప్పుడు వెక్కిరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్నది ల్యాండ్ పూలింగ్ కాదని... ల్యాండ్ పుల్లింగ్ అని భూమన విమర్శించారు. బలవంతంగా లాక్కున్న భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే దసరాకి రాజధాని నిర్మాణాలు ఒక రూపుకొస్తాయని చెబుతూ చంద్రబాబు మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News