: బోరబండలో భూ ప్రకంపనలు వాస్తవమే: సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనగేష్
హైదరాబాద్ లోని బోరబండలో నిన్న రాత్రి భూ ప్రకంపనలు సంభవించినమాట వాస్తవమేనని ఎన్ జీఆర్ ఐ సీనియర్ శాస్రవేత్త డాక్టర్ శ్రీనగేష్ పేర్కొన్నారు. భూకంప లేఖినిపై తీవ్రత 1.2 మాగ్నిట్యూడ్ గా నమోదైనట్లు తెలిపారు. హైదరాబాద్ లో కొన్నిచోట్ల భూమి కింద ఉన్న పగుళ్లే భూప్రకంపనలకు ప్రధాన కారణమని, చాలాకాలంగా వర్షాభావ పరిస్థితులు ఉండటం, ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడంతో ఇలాంటి ప్రకంపనలు సంభవిస్తాయని శ్రీ నగేష్ పేర్కొన్నారు. కాగా, బోరబండలోని గాయత్రినగర్, పద్మావతినగర్ లో నిన్న రాత్రి 3 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.