: ఆప్ కు మరిన్ని కష్టాలు... మరో ఎమ్మెల్యేపై కేసు నమోదు


ఆమ్ ఆద్మీ పార్టీని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలోని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హెన్రీ జార్జ్ ను కొట్టారనే ఆరోపణలతో ఆప్ ఎమ్మెల్యే నరేష్ బల్యన్ పై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదయింది. బాధితుడు జార్జ్ గతంలో ఆప్ కార్యకర్తగా కూడా పనిచేశారు. తన కార్యాలయంలోకి అనుచరులతో కలసి ప్రవేశించిన బల్యన్ తనపై దాడి చేసి, చంపేస్తానని బెదిరించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు జార్జ్. దీంతో, బల్యన్ పై పోలీసులు కేసు బుక్ చేశారు. మరోవైపు, తమపై జార్జ్ దాడి చేశాడంటూ ఎమ్మెల్యే బల్యన్ అనుచరులు కూడా కేసు పెట్టారు. దీనిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఈ రెండు కేసుల్లోనూ తాము ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News