: మా అంతం చూడాలనుకున్న వైఎస్ రాజారెడ్డి.. మాపైకి పరిటాల రవిని ఉసిగొల్పారు: జేసీ ప్రభాకర్ రెడ్డి


తమపైకి పరిటాల రవిని ఆనాడు వైఎస్ రాజారెడ్డి ఉసిగొల్పారని టీడీపీ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నేనెవరికీ భయపడను. నాటి టీడీపీ నేత పరిటాల రవికి నేను భయపడలేదు. పరిటాల ఇంటికి రాజారెడ్డి వెళుతుండేవారు. మా పతనాన్ని రాజారెడ్డి చూడాలనుకున్నారు. అందుకే, మాపైకి రవిని ఉసిగొల్పారు, పరిటాల హత్యతో మా అన్నకు ఎటువంటి సంబంధం లేదు" అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేసీ బ్రదర్స్ టీడీపీలోకి రావడం ఇబ్బందిగా అనిపించలేదా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీలోకి రమ్మని చంద్రబాబు పిలిస్తేనే వచ్చామని, పరిటాల సునీత మేం టీడీపీలోకి రావడాన్ని వ్యతిరేకించారని చెప్పారు. ఈ సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గురించి ప్రస్తావిస్తూ, ప్రభాకర్ చౌదరి ఇగోయిస్టు అని, ఆయన చెప్పిందే జరగాలంటారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News