: రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్న బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్


బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ముంబైలోని జుహు రోడ్ నెం 10లో ప్రయాణిస్తున్న వరుణ్ కారు, మరో కారును ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, ఈ ప్రమాద దృశ్యాన్ని చూసిన ఒక వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. కారు ప్రమాదం విషయమై ఎటువంటి గందరగోళం లేకుండా ఉండేందుకు వరుణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశాడు. కారు దెబ్బతింది తప్పా, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News