: ఉగ్ర దాడులపై స్పందించిన పాక్ నటి


యూరీ సెక్టార్ లో జరిగిన ఉగ్ర దాడులపై పాకిస్థానీ నటి మహీరా ఖాన్ స్పందించింది. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తాజా చిత్రం ‘రాయిస్’ ద్వారా ఆమె బాలీవుడ్ కు పరిచయం కానుంది. ఈ సందర్భంగా మహీరాఖాన్ మాట్లాడుతూ, భవిష్యత్తులో తమ పిల్లలు ఎక్కడ ఉన్నా ఒప్పుకుంటారు కానీ, ఉగ్రదాడులు జరిగే ప్రాంతాల్లో ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరని పేర్కొంది. భారత్, పాక్ దేశాలు రెండూ శాంతి పాటించాలని, ఉగ్రదాడుల వల్ల ఎంతో ప్రాణనష్టం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. నటిగా కొనసాగుతున్న తాను పాకిస్థాన్ గౌరవానికి భంగం వాటిల్లేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని పేర్కొంది. కాగా, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆర్టిస్టులపై నిషేధం విధించడంతో ‘రాయిస్’ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆమె తమ దేశానికి వెళ్లిపోయింది.

  • Loading...

More Telugu News