: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు...దుర్గగుడి విస్తరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు బెజవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వీరు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిని విస్తరించేందుకు కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు సౌకర్యాలు మెరుగుపడ్డాయని ఆయన గుర్తుచేశారు. అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించామని ఆయన చెప్పారు. గతంలో కంటే మరింత సౌకర్యవంతంగా అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు.