: 37.31 కోట్లకు ఇన్సూరెన్స్ క్లెయిం చేసిన కిమ్ కర్దాషియాన్
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు వెళ్లిన అమెరికా టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ ను పోలీసు వేషధారణలో వచ్చిన దుండగులు దోచుకున్న సంగతి తెలిసింది. ఈ సందర్భంగా ఆమెకు చెందిన సుమారు 37.31 కోట్ల రూపాయల (మొదట్లో వీటి విలువ 70 కోట్ల రూపాయలని వార్తలొచ్చాయి) విలువైన నగలను దోచుకెళ్లిపోయారు. ఇందులో కిమ్ ఎంగేజ్ మెంట్ రింగ్ కూడా ఉంది. దాని ఒక్క విలువే 24 కోట్ల రూపాయలుంటుందని సమాచారం. వెంటనే ఆమె భర్త కెన్యే వెస్ట్ ను రప్పించుకున్న కిమ్ ఫ్యాషన్ షోలో పాల్గొనకుండానే అమెరికా వెళ్లిపోయింది. ఈ నగలకు ఇన్సూరెన్స్ చేయించడంతో కిమ్ కర్దాషియాన్ 37.31 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లించాలని కోరుతూ క్లెయిం చేసుకుంది.