: సాక్షి పత్రికపై ధ్వజమెత్తుతూ... జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ


వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు తెలుగు దేశం పార్టీ నేత నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన సాక్షి పత్రికపై ధ్వజమెత్తారు. సాక్షి పత్రికలో అబద్ధాలు, అభూత కల్పనలు రాస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నిన్న సాక్షి పత్రికలో ప్రచురించిన కథనాలతో ఈ విషయం రుజువైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్సార్ తో పని చేసిన మంత్రులు, సహచరులపై సాక్షిలో తప్పుడు కధనాలు ప్రచురించిన ఘనత జగన్ దని ఆయన ఆరోపించారు. కాగా, హాం మంత్రి చినరాజప్పపై లోకేష్ ఫైరయ్యాడంటూ సాక్షిలో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొన్ని ఫోటోలను కూడా సాక్షి వెలువరించింది.

  • Loading...

More Telugu News