: ఆ ఫోటోను వైఎస్సార్సీపీ వివాదం చేస్తోంది: గాలి
ఉపముఖ్యమంత్రి చినరాజప్ప సూచనలపై లోకేష్ చర్చిస్తున్న సన్నివేశానికి చెందిన ఫొటోపై వైఎస్సార్సీపీ నెగెటివ్ ప్రచారం చేస్తోందని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ అధినేత జగన్ పోకడలు నచ్చక ఆ పార్టీ నుంచి సీనియర్ నేతలు పారిపోతున్నారని అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన పేర్కొన్నారు. హైటెక్ సిటీ ప్రారంభించినప్పుడు కూడా బాబుపై చాలా మంది విమర్శలు చేశారని గుర్తుచేసిన ఆయన, ఇప్పుడు అమరావతి విషయంలో కూడా అలాంటి విమర్శలే చేస్తున్నారని మండిపడ్డారు. స్విస్ ఛాలెంజ్ పధ్ధతిని చంద్రబాబు మాత్రమే అమలు చేయడం లేదని, గతంలో వైఎస్ కూడా దానిని అమలు చేశారని అన్నారు. కాగా, టీడీపీ నేత లోకేష్ వేదికపై సీరియస్ గా ఏదో అంశంపై ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు సీరియస్ గా వివరిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.