: మరోసారి దేశ వ్యాప్తంగా పెట్రోల్‌బంక్‌ల బంద్.. కీలక నిర్ణయాలు తీసుకున్న పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్
సర్కారు తమపట్ల అవలంబిస్తోన్న విధానాలకు వ్యతిరేకత తెలుపుతున్న పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్ మరోసారి దేశ వ్యాప్త బంద్, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 19, 26 తేదీలలో సాయంత్రం పెట్రోలు అమ్మకాలు జరపబోమని పేర్కొన్నారు. వచ్చే నెల 3, 4 తేదీల్లో ఆయిల్ కొనుగోళ్లు చేయబోమని పేర్కొన్నారు. ఆ నెల 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు అమ్మకాలు జరపబోమని చెప్పారు. వచ్చేనెల ఆరున పెట్రల్‌బంక్‌లు పూర్తిగా బంద్ చేస్తామని పేర్కొన్నారు. అంతేగాక, ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, ప్రతి ఆదివారం, అదే విధంగా సాధారణ సెలవు రోజుల్లోనూ పెట్రోల్ విక్రయించబోమని స్పష్టం చేశారు. తమ డిమాండ్లపై ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ చెప్పారు.