: ఐఫోన్7 వినియోగదారులకు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్


ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ వినియోగదారులకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ఇన్ఫినిటీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ తీసుకుంటే నెలకు 10 జీబి 4జీ/3జీ డేటాను ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని భారత, దక్షిణాసియా డైరెక్టర్ అజయ్ పురి తెలిపారు. ఈ ఉచిత డేటా విలువ ఏడాదికి దాదాపు రూ. 30 వేల వరకు ఉంటుందని ఎయిర్ టెల్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇన్ఫినిటీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ కింద 3జీ/4జీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్, వైంక్ మ్యూజిక్, వైంక్ మూవీస్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ లను ఎయిల్ టెల్ ఆఫర్ చేస్తోంది.

  • Loading...

More Telugu News