: రెండో వికెట్ కోల్పోయిన భారత్


న్యూజిలాండ్ తో ఇండోర్ లో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా 60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 53 బంతులను ఎదుర్కొన్న ఓపెనర్ గంభీర్ 29 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. 3 ఫోర్లు, 2 సిక్సర్లను బాదిన గంభీర్ చివరకు బౌల్ట్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం చటేశ్వర్ పుజారా 22, కెప్టెన్ విరాట్ కోహ్లీ 5 పరుగులతో ఆడుతున్నారు. అంతకు ముందు మరో ఓపెనర్ మురళీ విజయ్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు.

  • Loading...

More Telugu News