: ముగిసిన‌ తెలంగాణ కేబినెట్ స‌మావేశం.. ఆమోదం తెలిపిన‌ కీల‌క అంశాలు ఇవిగో..!


తెలంగాణ‌ రాష్ట్ర కేబినెట్ స‌మావేశం ముగిసింది. రాష్ట్ర‌ మంత్రుల‌తో ప‌లు అంశాల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ సుదీర్ఘంగా చ‌ర్చించారు. ద‌స‌రా నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కానున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. జిల్లాల పునర్వ్యవస్థీక‌ర‌ణకు ఆమోదం తెలిపింది. అయితే, జిల్లాల సంఖ్యపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేబినెట్ లో తీసుకున్న ఇత‌ర నిర్ణ‌యాలివే.. * ప్రపంచస్థాయి కేన్సర్ ఆసుప‌త్రి ఏర్పాటుకు భూమి కేటాయిస్తూ నిర్ణయం * 2017-18లో 119 బీసీ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఏర్పాటు * మైనార్టీ విద్యార్థుల కోసం 90 రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఏర్పాటు * కేన్స‌ర్ ఆసుప‌త్రి కోసం శేరిలింగంప‌ల్లిలో హెటిరో సంస్థ‌కు 15 ఎక‌రాల భూమి కేటాయింపు * జీహెచ్ఎంసీ ప‌రిధిలో అక్ర‌మ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ట్రైబ్యున‌ల్ ఏర్పాటు * పుర‌పాల‌క శాఖలో ఏకీకృత స‌ర్వీస్ రూల్స్ కోసం జీహెచ్ ఎంసీ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌ * కరీంనగర్‌, రామగుండం, సిద్దిపేట, నిజామాబాద్‌లో పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటుకు నిర్ణయం * బీసీ కమిషన్ ఏర్పాటుకు వీలుగా 1993 చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లకు ఆమోదం.

  • Loading...

More Telugu News