: ఇండియాకు వచ్చిన తొలిరోజే ఐఫోన్ 7పై రూ. 10 వేల తగ్గింపు... అమేజాన్, టాటా క్లిక్ వెరీ స్పెషల్ ఆఫర్
గత నెలలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విడుదలై శుక్రవారం నాడు భారత్ లో అందుబాటులోకి వచ్చిన యాపిల్ ఐఫోన్ 7 వేరియంట్ తొలిరోజునే రూ. 10 వేల డిస్కౌంట్ కు లభిస్తోంది. దీని ధర రూ. 60 వేల రూపాయలు కాగా, ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ రూ. 10 వేల డిస్కౌంట్ ను అందిస్తామని ప్రకటించింది. అమెరికన్ ఎక్స్ ప్రెస్ తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా, అమెక్స్ కార్డులున్న వారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఐఫోన్ 7, 7 ప్లస్ లను మార్కెట్ ధర కన్నా రూ. 10 వేల తక్కువకే పొందవచ్చని పేర్కొంది. ఇదే ఆఫర్ ఈఎంఐ విధానంలో ఫోన్లను కొనుగోలు చేసే వారికీ వర్తిస్తుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు రోహిత్ బన్సాల్ తెలిపారు. కాగా, టాటా క్లిక్ సైతం హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ ఫోన్లు కొనుగోలు చేస్తే, రూ. 10 వేల క్యాష్ బ్యాక్ ఇస్తామని వెల్లడించింది.