: మహిళా మంత్రి కిమిడి మృణాళినిని గుర్తించని పోలీసులు!
దసరా ఉత్సవాల్లో భాగంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి కిమిడి మృణాళినిని ఆలయ అధికారులు, పోలీసులు ఎవరూ గుర్తించలేదు. దీంతో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. దుర్గమ్మను లలితా త్రిపుర సుందరి రూపంలో అలంకరించగా, దర్శనం కోసం మృణాళిని దంపతులు ఆలయానికి చేరుకున్న వేళ, వీఐపీలు వెళ్లే మార్గం వద్ద ఉన్న పోలీసులు ఆమెను గుర్తు పట్టలేదు. దీంతో వారు కాసేపు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. కాసేపటి తరువాత మంత్రిని గుర్తించిన సిబ్బంది ఆమెను ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు. అధికారుల తీరు పట్ల మంత్రి అసహనాన్ని వ్యక్తం చేశారు.