: అది 'ఆప్' కాదు 'పాప్' పార్టీ... కేజ్రీవాల్ ఓ కోతి: రామ్ గోపాల్ వర్మ
పీఓకేలో భారత్ సైన్యం జరిపిన సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన డిమాండ్ పై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫైర్ అయ్యారు. తనదైన శైలిలో సెటైర్లు వేయడమే కాక... కేజ్రీపై ఘాటు విమర్శలు గుప్పించారు. మఫ్లర్ వేసుకునే కేజ్రీవాల్ ను చూసి ఇన్నాళ్లు ఆయన కోతిలా ఉన్నాడని అనుకునేవాడినని... తాజాగా, భారత సైన్యం శక్తి సామర్థ్యాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి నిజంగానే కోతి అని నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న కేజ్రీవాల్ పై కూడా సర్జికల్ దాడులు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆప్ పార్టీ పేరును పాప్ (పాపి) పార్టీగా మార్చాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ దాడులకు సంబంధించిన ఆధారాలు చూపాలంటూ కేజ్రీవాల్ చేసిన డిమాండ్ పై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సైతం కేజ్రీ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.