: సర్జికల్ స్ట్రయిక్స్ పై పాకిస్థాన్ పార్లమెంట్‌లో నవాజ్ షరీఫ్ ప్రకటన
పీవోకేలో ఉగ్రవాదులపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ ని భీకర కాల్పులుగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అభివర్ణించారు. ఆ దేశ పార్లమెంటులో ఈ రోజు ఆయన భారత్, పాక్‌ల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత సైన్యం చేసిన దాడిలో ఇద్దరు మాత్రమే చనిపోయారని చెప్పారు. తాము శాంతినే కోరుకుంటున్నామని ఎప్పటిలాగే వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని కోరుకోవడం లేదని అన్నారు. భారత సైనికుల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని మరోసారి హీరో అని ఆయన పేర్కొన్నారు. తమ దేశమూ ఉగ్రవాదానికి బలయిందని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. భారత్‌లోని యూరీ సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబడి ఆర్మీని బలిగొన్న అంశంపై మాట్లాడుతూ, ఆ దాడికి సంబంధించి ఎలాంటి విచారణ చేపట్టకుండానే తమను బాధ్యులమని ఆరోపించడం భావ్యం కాదని ఆయన అన్నారు.