: పాకిస్థాన్ కు షాక్.. కబడ్డీ వరల్డ్ కప్ లో పాల్గొనకుండా నిషేధం
ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్ కబడ్డీ టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనకుండా నిషేధం విధించారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (ఐకేఎఫ్) ఒక ప్రకటన చేసింది. ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనకుండా ఉండటమే మేలని భావించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐకేఎఫ్ చీఫ్ దేవ్ రావ్ చతుర్వేది వెల్లడించారు. కాగా, తొమ్మిదేళ్ల తర్వాత కబడ్డీ వరల్డ్ కప్ మళ్లీ జరుగుతుండటంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నెల 7వ తేదీ నుంచి కబడ్డీ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ ట్రాన్స్ స్టేడియంలో జరనున్న ఈ పోటీల్లో భారత్, అమెరికా, ఇరాన్, ఆస్టేలియా, దక్షిణ కొరియా, ఇంగ్లండ్, పోలాండ్, కెన్యా, అర్జెంటీనా, బంగ్లాదేశ్, జపాన్, థాయ్ లాండ్ దేశాలు తలపడనున్నాయి. ఈ నెల 22వ తేదీన కబడ్డీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.