: నౌషెరా సెక్టార్‌లో ఆర్మీ జవాన్లపై పాక్ కాల్పులు.. తిప్పికొడుతున్న సైన్యం
దాడులను తిప్పికొడుతూ భారత్ సైన్యం హెచ్చరిస్తున్నా పాకిస్థాన్ మాత్రం తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. కొద్దిసేపటి క్రితం జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో ఆర్మీ జవాన్లపై పాక్ మరోసారి కాల్పులు జరిపింది. అప్రమత్తంగా ఉన్న సైన్యం దాడులను తిప్పికొడుతోంది. ఈ రోజు ఒక్కరోజులోనే జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ ఐదుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నౌషెరా సెక్టార్‌లో పాటు పల్లన్‌వాలా, బాల్నోయి, కృష్ణగతిల్లో పాక్ కాల్పులకు తెగబడింది.