: రంగారెడ్డి జిల్లాలో ఐదురోజులుగా భూతపస్సు చేస్తోన్న బాబా!


రంగారెడ్డి జిల్లా రావిర్యాల‌లో ‘శ్రీ స‌త్యం శివం సుంద‌రం దాస్ మ‌హాత్యాగి’ అనే బాబా ఐదురోజులుగా భూ త‌పస్సు చేస్తున్నారు. త‌ల మాత్ర‌మే భూమిపైకి క‌న‌ప‌డుతోంది. మిగ‌తా శరీర భాగ‌మంతా భూమిలోనే ఉంది. ఈ త‌ప‌స్సును ‘ద‌స‌రా న‌వ‌రాత్రి భూత‌ప‌స్సు’ అని ఆయ‌న అనుచ‌రులు పేర్కొంటున్నారు. తొమ్మిది రోజుల పాటు కఠోర తపస్సు చేసిన త‌రువాత పూజ‌లు ఉంటాయ‌ని చెబుతున్నారు. బాబావారు ఊరు, ఊళ్లోని గుడి బాగు కోసమే ఈ దీక్ష చేప‌ట్టిన‌ట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లూ బాబా వ‌ద్ద స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవ‌డానికి వ‌చ్చిన భ‌క్తులు ఇప్పుడు ఆయ‌న చేస్తోన్న త‌ప‌స్సును వీక్షించేందుకు త‌ర‌లివ‌స్తున్నారు.

  • Loading...

More Telugu News