: ముద్రగడకు అండగా ఉంటాం..పోరాటంలో భాగమవుతాం!: దాసరి
ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ సాధన ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు అండగా ఉంటామని ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన నివాసంలో కాపు నేతలంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ, కాపు రిజర్వేషన్ పోరాటంలో భాగమవుతామని అన్నారు. ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు భవిష్యత్ ప్రణాళిక రచించామని అన్నారు. ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, రిజర్వేషన్లు సాధిస్తామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియడంతో ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. ముద్రగడ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దాసరి నారాయణరావు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, సినీ నటి హేమ తదితరులు పాల్గొన్నారు.