: సైనికుల ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)పై భారత్ జరిపిన నిర్దేశిత దాడులు (సర్జికల్ స్ట్రయిక్స్)పై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైనికుల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ‘పాకిస్థాన్ పై దాడి చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటాడు. కానీ, నకిలీ దాడులు చేయాలని ప్రజలు కోరుకోరు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి నకిలీ దాడులు చేయడం తగదని సంజయ్ నిరుమప్ మండిపడుతూ ఒక ట్వీట్ చేశారు. ఈ మేరకు యూపీలో ఏర్పాటు చేసిన పోస్టర్లను సంజయ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా స్పందిస్తూ, సైనికుల విశ్వసనీయతను దెబ్బతీసేలా సంజయ్ నిరుపమ్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు.