: లైంగిక వేధింపులను తట్టుకోలేక తమిళ నటి ఆత్మహత్యాయత్నం
తమిళంలో 'నెదునల్వాడై' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతూ, మలయాళంలో ఇప్పటికే పలు టీవీ సీరియల్స్ లో నటించిన అదితి అలియాస్ అథిరా సంతోష్ ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. చిత్ర డైరెక్టర్ సెల్వకన్నన్ లైంగికంగా వేధించడంతో తట్టుకోలేక మనస్తాపంతో గత వారం ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ఈ విషయం బయటపడడంతో ఆమెకు సానుభూతిగా మద్దతు పెరుగుతోంది. ఇక ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడిన ఆమె, నెదునల్వాడై చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి సెల్వకన్నన్ తను ఎంతో వేధించాడని, తొలుత ప్రేమిస్తున్నానని చెప్పాడని, తాను నిరాకరించగా, బెదిరించి, గదిలో నిర్బంధించాడని వాపోయింది. ఇదే విషయాన్ని నడిగర సంఘానికి ఫిర్యాదు చేస్తే, తాను మెంబర్ని కాదంటూ, వారు ఫిర్యాదు తీసుకోలేదని చెప్పింది. పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొంది. ఇటీవల ఓ యాడ్ షూటింగ్ నిమిత్తం తాను చెన్నైకి వస్తే, రౌడీలతో వచ్చిన సెల్వకన్నన్, శారీరకంగా హింసించి, లైంగికంగా వేధించాడని అందువల్లే తాను ఆత్మహత్యా ప్రయత్నం చేయాల్సి వచ్చిందని పేర్కొంది.