: తమ దేశంపై ఉగ్రవాదుల దాడి ఖాయమంటున్న అమెరికన్లు.. తాజా పోల్ లో వెల్లడి!


9/11 దాడుల తరువాత మొదలు పెట్టి, పదిహేను సంవత్సరాల నుంచి ఉగ్రవాదంపై పోరాడుతున్న తమ దేశంపై ఏ క్షణమైనా ఉగ్రదాడులు జరగవచ్చని అమెరికన్లు నమ్ముతున్నారు. 'న్యూ మార్నింగ్ కన్సల్ట్' సంస్థ నిర్వహించిన ఓ పోల్ లో సమీప భవిష్యత్తులో అమెరికాలోని ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రవాదులు భారీ ఎత్తున విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని 56 శాతం మంది చెప్పడం గమనార్హం. అమెరికా ప్రస్తుతం సురక్షితంగా ఉందని డెమోక్రాట్స్ పార్టీ వారు వెల్లడించగా, రిపబ్లికన్ వర్గానికి చెంది, పోల్ లో పాల్గొన్న అత్యధికులు దాడులు గ్యారెంటీ అని చెప్పడం గమనార్హం. పోల్ లో పాల్గొన్న ప్రతి 10 మంది రిపబ్లికన్లలో ఏడుగురు దాడులు ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. గత నెలలో మూడు ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగి, ఉగ్రదాడులపై అమెరికాలో హై అలర్ట్ కొనసాగుతున్న వేళ ఈ పోల్ జరిగింది.

  • Loading...

More Telugu News