: పంజాబ్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన జీలం ఎక్స్‌ప్రెస్
పంజాబ్‌లోని జలంధర్ దగ్గర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిల్లోర్ వద్ద జీలం ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో పది బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైలు పట్టాలు తప్పి బోగీలు ఒరిగిపోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.