: నీళ్ల కోసం సరిహద్దు దాటిన పాక్ బాలుడు.. రాత్రంతా బీఎస్ఎఫ్ క్యాంపులో ఆశ్రయం
తమలో మానవత్వానికి ఏమాత్రం కొదవ లేదని భారత్ మరోమారు ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రస్తుతం సరిహద్దులో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సమయంలోనూ సైనికులు తామేంటో నిరూపించారు. పొరపాటున భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ బాలుడిని బీఎస్ఎఫ్ అధికారులు సురక్షితంగా ఆదే అధికారులకు అప్పగించారు. పాకిస్థాన్‌లోని కసూర్ జిల్లా ధరీ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు తన్వీర్ ఆదివారం దాహం తీర్చుకునేందుకు బోరు బావి కోసం వెతుకుతూ భారత సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. పంజాబ్‌లోని డోనాటెలు మాల్ బోర్డర్ చెక్‌పోస్టు వద్ద బీఎస్ఎఫ్ అధికారులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు అడిగి రాత్రంతా తమ క్యాంపులోనే ఉంచుకున్నారు. మరునాడు బాలుడి వివరాలు చెబుతూ పాక్ అధికారులకు తన్వీర్‌ను అప్పగించారు.