: సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులపై స్పందించిన రాజ్‌నాథ్‌సింగ్

భార‌త్ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ఉగ్ర‌వాదులు, పాక్ సైన్యం కాల్పుల నేప‌థ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ నిన్న‌ రాత్రి బారాముల్లా ప్రాంతంలో భార‌త‌ సైనిక శిబిరాలపై సాయుధ తీవ్రవాదులు దాడులు జ‌రిపిన అంశంపై ఆయ‌న స్పందించారు. ఉగ్రవాదులకు భార‌త జ‌వాన్లు తగిన బుద్ధి చెప్పార‌ని వ్యాఖ్యానించారు. సైన్యానికి అభినందనలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. భార‌త సైన్యం ఉగ్ర‌వాదులను ఎంతో స‌మ‌య‌స్ఫ‌ూర్తితో తిప్పికొడుతోంద‌ని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. శ్రీనగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై కూడా ఆయ‌న త‌న‌ పర్యటనలో భాగంగా చ‌ర్చిస్తారు.

More Telugu News